
తెలంగాణ లో త్వరలో ఆన్లైన్ రమ్మీ మరియు పోకర్ పై నిషేధం ఎత్తివేస్తున్నారా?
అవును అనే సంకేతాలు ఇచ్చారు రాష్ట్ర పరిశ్రమల మరియు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. మంత్రి కేటీర్ కి అంత్యంత సన్నిహిత ఆఫీసర్స్ లో ఈయన ఒకరు.
గురువారం నాడు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ నిర్వహించిన ఒక సదస్సు లో అయన మాట్లాడుతూ నిషేధం ఉన్నా చాలా మంది యువత వీపీఎన్ (VPN) మరియు ఇతర సాధనాల ద్వారా నిషేదిత ఆన్లైన్ ఆటలను అడుతన్నారు అని అన్నారు.
ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో రోజు రోజుకి కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి అని, పూర్తి నిషేధం ఏ సమస్యకు పరిష్కారం కాదు అని ఆయన అన్నారు.
ఒక ముసాయిదా చట్టానికి సంబందించిన పని జరుగుతుంది అని, త్వరలోనే కాబినెట్ ముందుకు వస్తుంది అని ఆయన చెప్పారు. ముసాయిదా చట్టం ప్రకారం, రాష్ట్రం లో స్కిల్ గేమ్స్ ని అనుమతి ఇవ్వనున్నారు.
ఒక గేమ్, స్కిల్ గేమ్ ఆ కదా అనే నిర్ణయాధికారాన్ని ఒక గవర్నింగ్ బాడీ కి అప్పగించనున్నారు. ఈ గవర్నింగ్ బాడీలో రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ప్రతినిధులు, గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు ఉంటారు అని జయేష్ రంజన్ అన్నారు. ఈ గవర్నింగ్ బాడీ స్వయంప్రతిపత్తి కలిగి గవర్నమెంట్ జోక్యం లేకుండా పని చేస్తుంది అని ఆయన అన్నారు.
గేమింగ్ కంపెనీలు నిషేధానికి దారితీసిన కారణాలు అధ్యయనం చేసి అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి అని జయేష్ రంజన్ అన్నారు. గేమింగ్ కంపెనీలు KYC నిబంధలను పాటించాలి అని, గేమింగ్ వ్యసనం కాకుండా చర్యలు తీసుకోవాలి అని ఆయన ప్రసంగాన్ని ముగించారు.
ఆన్లైన్ రమ్మీ, పోకర్ మరియు Dream11 వంటి ఆటల పై తెలంగాణ 2017 లో నిషేధం విధించింది. అప్పటి నుండి ఆన్లైన్ పోకర్, రమ్మీ మరియు ఫాంటసీ స్పోర్ట్స్ ని తెలంగాణ రాష్త్రం లో ఇంటర్నెట్ ద్వారా ఆఫర్ చేసిన మరియు ఆడిన చట్టరీత్య నేరం. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ గేమింగ్ కంపెనీస్ తెలంగాణ హై కోర్ట్ ని ఆశ్రయించాయి. ఈ కేసు గడిచిన 5 ఏళ్ళు గా పెండింగ్లో ఉంది.
ఇదిలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్, తమిళ్ నాడు, కర్ణాటక, మరియు కేరళ (కేవలం రమ్మీ), తెలంగాణ రాష్ట్రం లాగా ఆన్లైన్ గేమింగ్ నిషేధ చట్టాలు చేసాయి. ఈ చట్టాలకు విరుద్ధంగా గేమింగ్ కంపెనీలు ఆయా రాష్ట్రాల హై కోర్ట్స్ ని ఆశ్రయించాయి. మద్రాస్, కేరళ, మరియు కర్ణాటక హై కోర్టులు గేమింగ్ నిషేధ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కేసు పెండింగ్లో ఉంది.